సరిగమ సాంగ్ ప్రోమో వీడియో

Spread the love

Sarigama Song Promo From Orey Bujjiga

రాజ్ తరుణ్ నటించిన న్యూ మూవీ ఒరేయ్ బుజ్జిగా ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ పోస్టర్ కు, టీసర్ కు మంచి గుర్తింపు వచ్చింది.ఐతే ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో పూర్తి కాగా లాక్ డౌన్ కారణగా రిలీజ్ చేయలేదు. ఒక వేల లాక్ డౌన్ లేకుంటే ఒరేయ్ బుజ్జిగా సినిమాన్ని ఉగాది సందర్బంగా మార్చి 25న విడుదల చేసి ఉండేవారు.
రాజ్ తరుణ్ సరసన మాళవిక నాయర్‌ హీరోయిన్ గా నటిస్తుండగా ఈ చిత్రంలో హెబ్బా పటేల్ కూడా కీలక పాత్రలో నటిస్తుంది.ఈ సినిమాకి విజయ్ కుమార్ కొండ దర్శకత్వం  వహించారు. మరి ఒరేయ్ బుజ్జిగా సినిమాన్ని కామిడి, రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రంగా శ్రీమతి లక్ష్మీ రాధామోహన్‌ సమర్పణలో శ్రీసత్యసాయి ఆర్ట్స్‌ పతాకంపై కొండా కె.కె.రాధామోహన్‌ తెరకేకిస్తున్నారు.

ఐతే ఒరేయ్ బుజ్జిగా సినిమా నుంచి ‘సరిగమ’ సాంగ్ ప్రోమోని జూన్ 27 అనగా శనివారం సాయంత్రం 5 గంటలకు విడుదల చేయబోతున్నట్లుగా చిత్రయూనిట్ ఒక పోస్టర్ ద్వారా అధికారకంగా తెలియచేసారు. మరి ఈ సరిగమ సాంగ్ కూడా రాజ్ తరుణ్, హేబ్బా పటేల్ ఫై ఉంటుందని పోస్టర్ ని బట్టి అర్ధం అవుతుంది.ఈ సినిమాకి  అనూప్‌ రూబెన్స్‌ సంగీతం అందిస్తుండగా ఒరేయ్ బుజ్జిగా సినిమాలో ముఖ్యమైన పాత్రలలో నరేష్ ,పోసాని కృష్ణమురళి,సత్య అక్కల,అజయ్‌ ఘోష్‌, అన్నపూర్ణ నటిస్తున్నారు.