ప్రభాస్ నాగ్ అశ్విన్ మూవీ స్టొరీ అదుర్స్ | Movie Mahal

Spread the love

Prabhas21 Story Line

ప్ర‌భాస్‌ బాహుబలి సాహో సినిమాలతో  ఇంటర్నేషనల్ స్టార్ గా ఎదిగాడు,  ఇప్పుడు ప్ర‌భాస్ హీరోగా న‌టిస్తోన్న 20వ సినిమా సోగం కి పైగా షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. జిల్ ఫేమ్ రాధాకృష్ణ ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోన్న ఈ పీరియాడికల్ లవ్ స్టోరికి సంబంధించి మిగిలిన షూటింగ్‌ను న‌వంబ‌ర్‌కంతా పూర్తి చేయాల‌ని అనుకున్నారు.

ఎందుకంటే న‌వంబ‌ర్‌లో ప్ర‌భాస్.. .మ‌హాన‌టి ఫేమ్ నాగ్ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వంలో వైజ‌యంతీ మూవీస్ బ్యాన‌ర్‌పై సినిమా చేయ‌బోతున్నాడు.

అందుతున్న సమాచారం మీరకు  ఈ సినిమా రూ.250 కోట్లకు పైగా బ‌డ్జెట్‌తో రూపొందనుంద‌ట‌. ఈ సినిమా దేవుడు, సైన్స్ అనే అంశాల మ‌ధ్య న‌డిచే క‌థాంశంతో సాగుతుందని అంటున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ దీపికా ప‌దుకొనే హీరోయిన్‌గా న‌టిస్తుంద‌ని తెలుస్తుంది. వ‌చ్చే ఏడాది చివ‌ర‌లో సినిమాను విడుద‌ల చేయాల‌ని ద‌ర్శ‌క నిర్మాత‌లు భావిస్తున్నార‌ట‌.

అయితే ప్రభాస్ 20 సినిమా షూటింగ్ ఈ నెలలోనే మొదలవ్వే అవకాశాలు కనపడుతున్నాయి. ఈ సినిమాను ప్రభాస్ సొంత బ్యానర్ UV క్రియేషన్స్ మరియు గోపి కృష్ణ మూవీస్ లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.