Tag Archives: prabhas20

ప్రభాస్ నాగ్ అశ్విన్ మూవీ స్టొరీ దానికి సంబందించింది

Prabhas Nag Ashwin Movie Story

నాగ్ అశ్విన్ మహానటి సినిమాని ఎంతో అద్బుతంగా తెరకెక్కించి ప్రేక్షకులో తన కంటూ ఒక గుర్తింపు ఏర్పరచుకొని అందరి చేత ప్రశంసలు అందుకున్నారు. మరి నాగ్ అశ్విన్ మహానటి సినిమాని తరువాత ప్రభాస్ తో సినిమా తీస్తునట్టు అధికారకంగా తెలియ చేసిన విషయం తెలిసిందే, మరి ఈ సినిమాని నాగ్ అశ్విన్ సైన్స్ ఫిక్షన్ నేపద్యం లో తెరకేక్కిస్తుండగా ప్రభాస్ 21 సినిమాని వైజయంతి మూవీస్ బ్యానర్లో అశ్విని దత్త్ నిర్మిస్తున్నారు. ఐతే నాగ్ అశ్విన్ ప్రభాస్ 21 సినిమా స్క్రిప్ట్ ని ఎప్పటినుంచో రాసుకుంటూ అనేక మార్పులు చేసి ఎట్టకేలకు కంప్లీట్ చేసుకున్నారు. ఐతే ఈ సినిమాని బారి బడ్జెట్ తో పాన్ ఇండియా లెవల్ లో అన్ని బాషలలో వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేస్తున్నారు. మరి ఇక ఈ సినిమా కధ విషయంలో ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ షోషల్ మీడియాలో తెగ హల చల్ చేస్తుంది. మరి ఆ విషయం ఎంటటే ప్రభాస్ 21 సినిమా కధ లోని పాత్రలను ఓ పురాణ కధ లోని పాత్రలు ఆధారంగా నేటి సమాజానికి పరిస్తుతులకు అనుకూలంగా కధని నాగ్ అశ్విన్ రాసుకున్నారు అని తెలుస్తుంది. ఇక ఈ సినిమాలో ముఖ్యంగా ప్రభాస్ రెండు పాత్రలలో నటిస్తున్నారు అని తెలుస్తుంది. ఇక ఈ సినిమా కి సమదించి కీలక పాత్రల కోసం బాలీవుడ్ స్టార్స్ ని తెసుకోవాలని నాగ్ అశ్విన్ చూస్తున్నారు. అంతేకాకుండా ఈ సినిమా లో హీరోహిన్ ని కూడా బాలీవుడ్ బామ ని తీసుకోవాలని ప్రయత్నిస్తున్నారు.ఇక ఈ సినిమాకి సమదించి అప్డేట్ ని కూడా ఈ మంత్ ఎండింగ్ లో తెలియ చేస్తారని సమాచారం. ఇక ఈ సినిమా స్క్రిప్ట్ కి సాయి మాధవ్ బుర్ర డైలాగ్స్ రాస్తున్నారు. ఐతే ప్రభాస్ అభిమానులు ఈ సినిమా బారి అంచనాలు ఏర్పరచుకొని ఉన్నారు. ఇక ఈ సినిమాని నాగ్ అశ్విన్ ఏ రెంజులో తెరకేకిస్తారో చూడాలి.

ప్రభాస్ మూవీ నెక్స్ట్ ఇయర్ ఏప్రిల్ లోనే

Prabhas Nag Ashwin Movie Shooting Postponed

ప్రభాస్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా వైజయంతి బ్యానర్ ఒక మూవీ చేస్తున్న విషయం తెలిసిందే, ఐతే ఈ సినిమా షూటింగ్ 2020 అక్టోబర్ లో ప్రరబించాలని ఎప్పటి నుండో ప్లేన్ చేసుకున్నారు చిత్ర యూనిట్. ఐతే కరోన ప్రభావం తో షూటింగ్ డేట్ లు ఇప్పటికే చాల సార్లు మార్చుకున్నారని సమాచారం, దానికి కారణం ప్రభాస్ రాధా కృష్ణ తో తీస్తున్న మూవీ నే, ఈ సినిమా ఇంకా షూటింగ్ కంప్లేట్ కాలేదు ఈ సినిమాను పూర్తి చేసిన తరువాతనే ప్రభాస్ నాగ్ అశ్విన్ మూవీ లో పాల్గొనాల్సి ఉంటుంది.

ఐతే అందుతున్న తాజా సమాచారం మేరకు ప్రభాస్ నాగ్ అశ్విన్ మూవీ నెక్స్ట్ ఇయర్ ఏప్రిల్ లో షూటింగ్ మొదలుపెట్టడానికి రంగం సిద్దం చేస్తున్నట్టు సంచారం, ఇప్పటికే నాగ్ అశ్విన్ ఈ సినిమాకు సంబందించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ కంప్లీట్ చేసుకున్నాడంట, ఇంక ఈ సినిమా 250 కోట్లకు పైగా బడ్జెట్ తో నిర్మించబోతున్నారు. ఇదొక sci-fi జోనర్ కి సంబందించిన సినిమా.

ప్రభాస్ 20 సినిమాలో రానా | Prabhas

Also Read…. ఏం ప్లాన్స్ స్వామి పవన్ కళ్యాణ్ రికార్డు బ్రేక్ చేయటం పక్కా

Also Read…. బాలీవుడ్ ఖాన్స్ కన్నా ప్రభాస్ పర్ఫెక్ట్

Also Read…. బాహుబలి ట్విట్టర్ ట్రెండ్ స్పెషల్ వీడియో

ప్రభాస్ న్యూ మూవీ మ్యూజిక్ డైరెక్టర్ తమిళ్ సేన్సేషనల్

ప్రభాస్ రాధాకృష్ణ దర్శకత్వంలో తన 20 సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే, ఐతే రాధే శ్యామ్ సినిమా షూటింగ్ ఇప్పటివరకు సగం వరకు పూర్తి చేసుకుంది. ఐతే  లాక్ డౌన్ కారణంగా షూటింగ్ ని ఆపి ఉన్న విషయం తెలిసిందే, మరి కరోనా లాక్ డౌన్ కి ముందు జార్జియా షెడ్యూల్ పూర్తి చేసుకుంది.

ఐతే ఈ సినిమా 1980 లో జరిగే  లవ్ అండ్ రొమాంటిక్ మూవీ కావున ఈ సినిమాకి రాధే శ్యామ్ అనే టైటిల్ ని ఖరార్ చేయాలనీ చిత్ర యూనిట్ చూస్తున్నారు. రాధే శ్యామ్ సినిమాలో ప్రభాస్ సరసన పూజా హెగ్డే హీరోహిన్ గా నటిస్తున్నారు. మరి ప్రభాస్ 20 సినిమాకి సంగీతాన్ని అమిత్ త్రివేదీ అందిస్తున్నాటు సినిమా స్టార్టింగ్ లో వినిపించగా కొన్ని కారణాలు వల్ల అతని ప్లేస్ లో  హైలీ టాలెంటెడ్ తమిళ్ కంపోసర్ జస్టిన్ ప్రభాకరన్ ను సంగీతాన్ని అధిచడానికి తీసుకున్నారు అని సమాచారం .

ఐతే జస్టిన్ ప్రభాకరన్ ముందుగా తెలుగులో డియర్ కామ్రేడ్ సినిమాకి సంగీతాన్ని అందించగా సూపర్ హిట్ గా నిలిచింది. అందువల్లన్న ప్రభాస్ 20 సినిమాకి సంగీతాన్ని  అధిచడానికి తీసుకున్నారు అని తెలుస్తుంది. మరి ఇక ఈ సినిమాకి సమదించి షూటింగ్ ని స్టార్ట్ చేయడానికి చిత్ర యూనిట్ అనుమతి తీసుకోగా ఈ షూటింగ్ ని 5 కోట్ల వ్యయంతో హాస్పేటల్ సెట్ న్ని ఆర్ట్  డైరెక్టర్ రవీందర్ సమక్షం లో నిర్మిస్తున్నారు. 

నైజాం గడ్డా ప్రభాస్ అడ్డా | Prabhas | Movie Mahal

Nizam King Kong Prabhas

సినిమాలు అంటే రికార్డ్స్ గురించే మాట్లాడుకుంటారు ఫాన్స్, మా హీరో ఆ రికార్డు కొట్టాడు మా హీరో ఈ రికార్డు కొట్టాడు అంటూ వాళ్ళ ఫ్యాన్ హీరో గురించి గొప్పలు చెప్పుకుంటారు, ఐతే తెలుగు రాష్ట్రాలలో నైజాం ఏరియా రికార్డ్స్ చాల స్పెషల్ అక్కడే ఎక్కువ మనీ ఎక్కువ వసూళ్లు వస్తుంటాయి,

ఐతే విషయం ఏంటంటే ప్రభాస్ ను వాళ్ళ అభిమానులు నైజాం గడ్డా ప్రభాస్ అడ్డా అనిపిలుచుంటారు, ఎందుకు అంటే ప్రభాస్ నటించిన లాస్ట్ మూడు సినిమాలు మొదటి రోజు నైజాం లో అల్ టైం రికార్డ్స్ ను నమోదు చేసుకుంది. అవి ఏ సినిమాలో ఒక్క సారి చూసినట్లయితే సాహో మొదటి రోజు 9.4cr (All Time Record) అల్ టైం రికార్డు, బాహుబలి-2 8.9cr అల్ టైం రికార్డు, బాహుబలి 6.3cr అల్ టైం రికార్డు, ఇలా తీసిన లాస్ట్ మూడు సినిమాలు నైజాం లో మొదటి రోజు అల్ టైం రికార్డ్స్ ప్రభాస్ కతాలో ఉన్నాయి. అందుకేగా ప్రభాస్ అభిమానులు ప్రభాస్ ను నైజాం గడ్డా ప్రభాస్ అడ్డా అనుకునేది.

ప్రభాస్ 20 టైటిల్ అద్దిరిపోయింది | Prabhas | Movie Mahal

Prabhas20 Title Almost Fix

ప్రభాస్ తన 20 సినిమాను జిల్ దర్శకుడు తో కలసిచేస్తున్న సంగతి తెలిసిందే, ఈ సినిమా టైటిల్ మొదట జాన్ అనేది వాడుకలో ఉండింది,

కాని శర్వానంద్ హీరోగా సమంతా హీరోయిన్ గా తీసిన సినిమాకు జాను అనే టైటిల్ ను వాడుకోవడం తో ఓ డియర్ రాదే శ్యాం అనే టైటిల్ లను ఫిలిం ఛాంబర్ లో బుక్ చేసుకున్నారు UV క్రియేషన్స్ వాళ్ళు,

దీంతో ఈ సినిమ టైటిల్ ఈ రొండు టైటిల్స్ లో అందరికి ఓ డియర్ కనెక్ట్ అవ్వడంతో అందరు ఓ డియర్ టైటిల్ నే ఫిక్స్ చేస్తారనుకున్నారు, ఐతే ఇప్పుడు రాదే శ్యాం అనే టైటిల్ తోనే ఫస్ట్ లుక్ రిలీజ్ అవబోతుందని తెలుస్తుంది,

రాదే శ్యాం టైటిల్ హిందీలో జనాలకు కూడా బాగా కనెక్ట్ అవచ్చు అనే కారణంతోనే ఈ టైటిల్ ని ఫిక్స్ చేయవచ్చు అని సమాచారం,

ఇంక ప్రభాస్ ఫస్ట్ ను రెండు లూక్స్ లో రిలీజ్ చేసేఅవకాశాలు ఉన్నాయి, ఒక లుక్ క్లాసి మరొకటి మాసి లూక్స్ రిలీజ్ చేసేందుకు UV క్రియేషన్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఈ ఫస్ట్ లుక్ అతి తొందరలోనే రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నాయి.

హిందీలో ఒక్కటే 80 కోట్లు ప్రభాస్ ఊర మాస్ | #Prabhas20 Updates

Prabhas20 Hindi Rights

ప్రభాస్ 20వ సినిమా పైన అంచనాలు ఎంతలా ఉన్నాయి అంటే అది మాటల్లో చెప్పలేనిది, సాహో వంటి బ్లాక్ బస్టర్ తరువాత ఈ సినిమా రావటం తో చాల అంచనాలు పెరిగిపోయాయి, సాహో హిందీలో 150 కోట్లకి పైగా వసూలు సాదించడంతో ప్రభాస్20 వ సినిమా పైన హిందీలో ఎక్కువ అంచనాలుఉన్నాయి.

దీంతో ఈ సినిమాను ధర్మా ప్రొడక్షన్స్ 80 కోట్లకు పైగా కర్చు పెట్టి కొన్నారట, అంటే ఇప్పటివరకు ఏ సౌత్ ఇండియన్ మూవీ అందుకోలేని రేట్ కి ప్రభాస్ 20 సినిమా అమ్ముడుపోయినట్టే అని చెప్పాలి,

బాహుబలి, రోబో 2.0, సాహో వంటి సినిమాలు కూడా ఇంత బారి కర్చు పెట్టి కొనలేదు, దీన్ని బట్టే అర్ధం అవుతుంది ప్రభాస్ 20 సినిమా పైన ఎంత హైప్ ఉందొ అని, ఐతే ఈ వార్త ఆఫిసిఅల్ గా తెలిసేందుకు ఇంకొద్ది సమయం పట్టే అవకాశాలుఉన్నాయి.

ప్రభాస్ 20 ఫస్ట్ లుక్ వచేస్తుంది | #prabhas20firstlook | movie mahal

Prabhas20 First Look

ప్రభాస్ ఇప్పుడు తన 20వ సినిమాలో బిజీ గా ఉన్నాడు. ఐతే ఈ సినిమాలో ప్రభాస్ ఎలా కనిపించాబోతున్నదో అని ప్రభాస్ ఫాన్స్ తోపాటు సగటు సినీ అభిమాని ఎదురుచూస్తున్నారు, మరి ప్రభాస్ సాహో సినిమా తరువాత ఈ సినిమా రావడంతో చాల హైప్ ఉంది, ఐతే ఇప్పటికే ఈ సినిమా నుండి డైరెక్టర్ రాధా కృష్ణ కుమార్ లాంచ్ ఫోటో విడుదల చేయగా అవి సోషల్ మీడియాలో వైరల్ అవ్వాయి.

ఐతే ఇప్పుడు దేశం మొత్తం ప్రభాస్ 20 సినిమా ఫస్ట్ లుక్ కోసం వెయిట్ చేస్తున్నారు. మరి అందుతున్న తాజా సమాచారం మేరకు ప్రభాస్ 20 ఫస్ట్ లుక్ ను ఈ నెల రెండవ వారములో రిలీజ్ చేసేందుకు సన్నాహాలు సిద్దం చేస్తున్నారు.

మరి ఈ ఫస్ట్ లుక్ రీచ్ తెలుగులో ఒక్కటే కాకుండా 5 బాషలలో రిలీజ్ చేయనున్నారు, తెలుగులో కన్నా హిందీలోనే సాహో బ్లాక్ బస్టర్ విజయాన్ని సాదించిన విషయం తెలిసిందే అందుకే ఈ సినిమా ని కూడా హిందీలో తగు జాగ్రత్తలు తీసుకోబోతున్నారు.

Good News For Prabhas Fans | Prabhas20 Updates | Movie Mahal

Prabhas20 Shooting Update

ప్రభాస్ హీరోగా పూజ హెగ్డే హీరోయిన్ గా రాధా కృష్ణ కుమార్ దర్శకత్వంలో ఒక మూవీ వస్తున్నా సంగతి తెలిసిందే, ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం కరోన వైరస్ కారణంగా వాయిదా వేయటం జరిగింది, ఐతే ప్రస్తుతం ఉన్న పరిస్తితుల్లో ప్రభాస్ ఫాన్స్ కు ఇది ఒక మంచి వర్తనే ఇది అని చెప్పవచ్చు, ఇప్పటికే ప్రభాస్ 20 సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ కాక ప్రభాస్ ఫాన్స్ విసిగిపోయి ఉండగా ఈ న్యూస్ కొంచం ఎనర్జీ ఇవ్వవచ్చు,

ఈ సినిమా షూటింగ్ జూన్ నెల రెండవ వారంలో మొదలుకాబోతుందని అలానే షూటింగ్ మొదలుకాకముందే ఫస్ట్ లుక్ టైటిల్ కూడా రిలీజ్ చేస్తారని సమాచారం. ఫస్ట్ లుక్ టైటిల్ కోసం ప్రభాస్ అభిమానులు వెయ్యి కళ్ళతో వెయిట్ చేస్తున్నారు, పాన్ ఇండియన్ మోవి కావటంతో అలానే ప్రభాస్ పైన ఇండియా మొత్తం ఎక్కువ హైప్ ఉండటం తో ఫస్ట్ లుక్ రిలీజ్ చేసినప్పుడు అందరికి రిచ్ అవాలనే కారణంతోనే ఇన్ని రోజులు వెయిట్ చేయించారని తెలుస్తుంది.

Prabhas20 First Look Leak | Oh Dear First Look

ప్రభాస్ 20 సినిమా నుండి ఇప్పటికి ఫస్ట్ లుక్ రిలీజ్ కాకపోవడంతో ప్రభాస్ అభిమానులు సోషల్ మీడియాలో రచ్చ రచ్చ లేపుతున్నారు, అది ఎంతలా అంటే ఫస్ట్ లుక్ కోసం ఎదురు చూసి చూసి ఫస్ట్ లుక్ ఇక రిలీజ్ కాదులే అని, ప్రభాస్ పాస్ పోర్ట్ సైజు ఫోటో ఒకటి ఎక్కడినుండో తెచ్చి ప్రభాస్ 20 సినిమా ఫస్ట్ లుక్ ఇదేనంటూ UV క్రియేషన్ ను ట్యాగ్ చేసి మరి వాళ్ళ బాధను తెలుపుకుంటున్నారు,

దీంతో ప్రభాస్ అభిమానులకు వచ్చిన భాదలు మాకు రాకూడదు అని ఇతర హీరో అభిమానులు బావిస్తున్నారు. ప్రభాస్ 20 సినిమా ఫస్ట్ లుక్ ఎప్పుడో రిలీజ్ చేస్తాం అని డైరెక్టర్ రాధా కృష్ణ తెలిపినప్పటికీ కరోన వైరస్ కారణంగా వాయిదా వేసారు, ఇంకా ఈ నెల 31 తో లాక్ డౌన్ 4.0 ముగుస్తునడటంతో ఏమైనా అప్డేట్ ఇచ్చే అవకాశాలు ఉండవచ్చు.

Download Photo