టాలీవుడ్ గాడ్ ఫాదర్ సాలార్ సినిమాలో కీ రోల్

Spread the love

Buzz: Tollywood Bigg Star Act With Prabhas

ప్రభాస్ బ్యాక్ to బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే, మే 15 నుండి అడిపురుష్ షూటింగ్ లో పాల్గొనాల్సిన ప్రభాస్ హైదాబాద్ లాక్ డౌన్ వలన షూటింగ్ ఆగిపోయింది. మరి అడిపురుష్ సినిమా షూటింగ్ తో పాటు ప్రభాస్ సాలార్ సినిమా షూటింగ్ లో కూడా పాల్గొంటూ వస్తున్నాడు.

ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీలో లో ఒక గాడ్ ఫాదర్ క్యారెక్టర్ వుంది. ఇంతవరకూ దానికి ఎవరైతే బెటర్ అనే క్లారిటీకి రాలేకపోతున్నారు మేకర్స్. క్యారెక్టర్ తో పాటు సినిమాకూ వెయిట్ పెరగాలంటే.. బిగ్ స్టార్ ని సీన్లోకి రప్పించాల్సిందేనని, మెగాస్టార్ అయితే పక్కాగా బ్యాలెన్స్ అవుతుందని సజెషన్స్ వచ్చాయట.

ప్రస్తుతానికి ప్రైమరీ స్టేజ్ లోనే వున్న ఈ సాలిడ్ ప్రపోజల్.. ఫైనల్ డీల్ దాకా వెళితే.. మరో క్రేజీ మల్టీస్టారర్ ని చూసే అదృష్టం దక్కుతుంది తెలుగు ఆడియెన్స్ కి.